నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడకి చెందిన శ్రీను అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందులో భాగంగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 1 లక్ష 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా నిలబడుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు పాల్గొన్నారు.