- పార్లమెంట్ ఎన్నికలలో మోడీ ప్రభంజన సునామీలో రెండు పార్టీల అడ్రస్ గల్లంతవడం ఖాయం
- చేవెళ్ల పార్లమెంటు ఏడు నియోజకవర్గాల బూత్ స్థాయి అధ్యక్షులతో సమీక్ష, సమ్మేళనంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి , శేరిలింగంపల్లి కార్యవర్గ సభ్యుడు రవి కుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : దేశ ప్రజలు మళ్లీ ప్రధాని మోడీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని శేరిలింగంపల్లి కార్యవర్గ సభ్యుడు రవి కుమార్ యాదవ్ పేర్కొన్నారు. చేవెళ్ల రోడ్డు జే.పి. ఎల్ కన్వెన్షన్ హిమాయత్ నగర్ లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల పార్లమెంటు ఏడు నియోజకవర్గాల బూత్ స్థాయి అధ్యక్షులతో సమీక్ష, సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్లమెంటు ఇంచార్జ్ మల్లారెడ్డి, అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ శక్తి – ఆశయం ముందు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు పరార్ కావడం ఖాయమని, పక్క పార్టీ నేతలను తీసుకువచ్చి బరిలోదించే దౌర్భాగ్య పరిస్థితిలో ఆ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు ఏర్పరచుకొని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపునకు కృషి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని, చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఓట్లను తీసుకువచ్చి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించి ప్రధాని మోడీకి, కిషన్ రెడ్డికి చేవెళ్ల సీటును కానుకగా ఇస్తామని కార్యకర్తల సమక్షంలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి శక్తి కేంద్ర ఇన్చార్జులు -బూత్ అధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర, జిల్లా పద అధికారులు, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, మహిళా మోర్చా, యువ మోర్చా, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ స్థాయి అధ్యక్షులు పాల్గొన్నారు.