నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో నిర్వహించిన అన్నమ స్వరార్చన ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాన్ని విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమయ్య అష్టోత్తరం, “శ్రీ నందకాయ” అన్నమ గాయత్రి “శ్రీ మద్వదీయ” అన్నమయ్య గురుస్తుతితో ప్రారంభించారు.
అనంతరం “వివేక చూడామణి” కూచిపూడి, భరతనాట్యంలోని కూచిపూడి నాట్య బృందృం “శ్రీదాస్యం హవిష, తన్విశ్రీ పాలూరి, కోటికన్యాదానం హర్షిక్, రిషిక శ్రీ అట్లూరి, శ్రీ భాష్యం అశితేక్షణ, ఎస్. సమంవిత” భరతనాట్యం శిష్య బృందం “ప్రత్యూష రాచకొండ, బి. హేత్విక, దియా ఆనంది కొలుసు, దీక్ష మాసాడే, నిశిత దాస్, మంతెన సాయి ప్రార్థన వర్మ, ఉద్దండం మధులిక సాయి, డేగ సహస్ర రెడ్డి, వేదశృతి జట్టి, సాయి అద్వితి నల్లబల్లె” సంయుక్తంగా అన్నమయ్య సమేత శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి “మూషిక వాహన, పుష్పాంజలి, జయ జనార్థన, జతి స్వరం, అలరిపు, బ్రహ్మాంజలి, పలుకే బంగారమాయేనా, ఆనంద తాండవం” అనే ప్రఖ్యాత సంకీర్తనలకు నృత్య ప్రదర్శనతో తమ తమ నైపుణ్యతను చాటుకున్నారు. అనంతరం సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు కళాకారులని శాలువా జ్ఞాపికతో సత్కరించారు. అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి “అంగనలీరే” మంగళ హారతి ఇచ్చి ప్రసాద వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగించారు.