నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధి తార నగర్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబీబ్ బాయ్ ఆధ్వర్యంలో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినందించదగ్గ విషయమన్నారు. తెలంగాణకు ప్రత్యేకమైన “గంగా జమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబీబ్ బాయ్, అన్వర్ షరీఫ్, అహ్మద్, నటరాజు, రవి యాదవ్, రహీం బాయి, సయ్యద్ మీరు అలీ, సయ్యద్ పాషా, నయీమ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.