- సుబాష్ చంద్రబోస్ నగర్ బీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
- సాదరంగా ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుబాష్ చంద్రబోస్ నగర్ బిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ముక్తర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బస్తి అధ్యక్షులు బస్తీ సభ్యులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని బస్తి/కాలనీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, మంచి వ్యక్తి సేవ గుణం గల నేత జగదీశ్వర్ గౌడ్ అన్నకు తోడుగా అడుగులు అడుగై ముందుకు నడుస్తామని కార్యకర్తలు తెలిపారు. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుందని, ప్రజా పాలనకు నిదర్శనంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు సయ్యద్ గౌస్, నియోజకవర్గ నాయకులు మహిపల్ యాదవ్, మాదాపూర్ కాంటెస్టడ కార్పొరేటర్ నగేష్ నాయక్, మునఫ్ ఖాన్, ఇస్మాయిల్, సాజిద్, జఫ్ఫార్, ఆనంద్ సింగ్, మహేష్, మెయిన్, మహిళలు పాల్గొన్నారు.