- చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్దంగా పనిచేయాలి: చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి , చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఏ.వెంకట నారాయణ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి, బి.జే.వై. ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ , మాజీ శాసన సభ్యులు రత్నం, అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ కంటేస్టేడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంటు కన్వీనర్ మల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్లు , జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అభ్యర్థి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు మంచి చేసే, నిస్వార్థమైన నీతివంతమైన భారతీయ జనతా పార్టీ ని గెలిపించడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని, పార్లమెంట్ ఎన్నికల కోసం అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రజలను మభ్య పెడుతు మోసం చేస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తలు బూతు స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు, మంచి పనులు వివరిస్తూ నరేంద్ర మోదీ రి నేతృత్వంలో బీజేపీకి ఓటు వేస్తే కలిగే ప్రయోజనాలను తెలపాలని సూచించారు.
చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్దంగా పనిచేయాలని, అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు వారి వారి మండలాల్లో, డివిజన్లలో పూర్తి స్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో కలుస్తూ , మరిన్ని చేరికలతో పార్టీనీ బలోపేతం చేయాలన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి బూతుల్లో ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని, విజయ సంకల్ప యాత్ర, రామ మందీర్ యాత్ర విజయవంతం చేయాలని కోరారు.
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో వారి వారి బూతు స్థాయిలో కార్యకర్తలు, నాయకులు దేశాభివృద్ధికి, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు వివరించి చెప్పాలన్నారు. వారి బూత్ స్థాయి నుండి చేరికలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, సునీతా రెడ్డి, బొక్క నరసింహ రెడ్డి, మాధవ రెడ్డి, నందకుమార్ యాదవ్, అంజన్ కుమార్ గౌడ్, శ్రీనివాస్, పాపయ్య గౌడ్, జంగయ్య యాదవ్, అరుణ్ కుమార్, కరుణ , శ్రీరాములు యాదవ్, ప్రేమ్ రాజ్, శివరాజ్, నరేందర్ రెడ్డి, అనంతయ్య గౌడ్, అమరేందర్ రెడ్డి, వేణుగోపాల్, రాజ్ భూపాల్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, నవీన్ కుమార్, కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.