నమస్తే శేరిలింగంపల్లి : బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, యువ నాయకుడు మధు కుమార్ ఉప్పుటూరి, శ్రవణ్ కుమార్ లు తమ మొక్కు తీర్చుకున్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భారీ మెజారిటీతో గెలిస్తే గంగారం హనుమాన్ టెంపుల్ కు 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నామని, ఎమ్మెల్యే గాంధీ స్వ హస్తాలతో గంగారం హనుమాన్ మందిరంలో 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, రామరాజు (బబ్లు), భగత్, మిద్దెల మల్లారెడ్డి, రాజు, తిరుమలేష్, మల్లేష్, కంది జ్ఞానేశ్వర్, రాజు, వీరేంద్ర, గణేష్, మల్లేష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.