- కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండావందనం సమర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల స్వాతంత్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడానికి రాజ్యాంగం ఒక వరం లాంటిదని, సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి నేటికీ సరిగ్గా 74 ఏళ్ళుపూర్తి చేసుకొని 75 వ వసంతంలోకి అడుగు పెడుతున్నామని, తెలియచేసి, శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజలకు 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.