- కూకట్ పల్లి తహసిల్దార్ వినతి పత్రం అందజేత
నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపిజీఎస్, ఏ ఐ కే ఎఫ్, ఏఐఏడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కూకట్ పల్లి తహసిల్దార్ వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మైదన ప్రాంతా గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్ వి. తుకారాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని, రెండు లక్షల రైతు పంట రుణాలను మాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు 15వేల రైతుల ఖాతాలో జమ చేయాలని, రైతుల వరి పంటకు బోనస్ గా ప్రకటించిన క్వింటకు 500 తక్షణమే అమలు చేయాలని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. వ్యవసాయ కార్మికులకు 12000 చొప్పున ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తించి గుర్తింపు కార్డులను ఇచ్చి రైతు భరోసా రైతు భీమా పంట రుణాలు పంట నష్టపరిహారాలు ఇవ్వాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు పంచాలని ధరణి లోపాలను సవరించి వాస్తవ సాగుదారులను గుర్తించి రికార్డులలో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైదాన ప్రాంత గిరిజన సంఘం నాయకులు సీతారాం నాయక్, శివ పాల్గొన్నారు.