రంగులమయం

  • ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు

నమస్తే శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గాంధీ ఎస్టేట్స్ అపార్ట్ మెంట్సు వద్ద, మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూకాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల రంగవల్లికలు వేసి తమ ప్రతిభ చాటుకున్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం

విజేతలకు కొమిరిశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ బహుమతులు అందజేసి అనంతరం మాట్లాడారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా తాటిచర్ల వరలక్ష్మి వ్యవహరించారు.

ముగ్గులు వేస్తున్న మహిళలు

ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, విజయలక్ష్మి, వరలక్ష్మి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శ్రీధర్, శ్రీనివాస్, శిరీష్, ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here