ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

జనప్రియ నగర్-2 వద్ద స్థానిక ప్రజలతో కలిసి ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడుతున్న జగదీశ్వర్ గౌడ్

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్-2 వద్ద స్థానిక ప్రజలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ..

ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, బల్లింగ్ యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, సంగారెడ్డి, మనెపల్లి సాంబశివరావు, సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, అశోక్, కొండల్ రావు, అంజయ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here