పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం

  • జనసేన పార్టీ చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ మాధవ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చందానగర్ డివిజన్ అద్యక్షులు అరుణ్ కుమార్ పాల్గొని రానున్న రోజుల్లో జనసేన పార్టీని డివిజన్ స్థాయిలో అనుసరించ వలసిన వివరాలను తెలిపారు.

చందానగర్ డివిజన్ ఆత్మీయ సమావేశంలొ జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ మాధవ రెడ్డి, డివిజన్ అద్యక్షులు అరుణ్ కుమార్, తదితరులు

ఈ ఆత్మీయ సమావేశంలో డివిజన్ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతానికి అభిప్రాయలను తెలిపారు. అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటామని, మును ముందు జనసేన పార్టీ సిద్ధాంతాలను నియోజవర్గస్థాయిలో ప్రతి గడప గడపకు తీసుకెళ్లే కార్యచరణ రూపొందిస్తున్నట్లు మధవరెడ్డి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here