నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందనగర్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో లింగంపల్లి డివిజన్ తారానగర్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని, ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు కృష్ణ ముదిరాజ్, రఘునందన్ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, వీరేశంగౌడ్, అజిమ్ ఖాన్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు అలీ, లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు జంజీర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీహరి గౌడ్, నాయకులు గౌస్, షఫీ, ప్రసాద్ ముదిరాజ్, అజిముద్దీన్, ప్రవీణ్ కుమార్, మిరాజ్, అజామ్, నర్సింగ్ రావు, నందు యాదవ్, పాషా, సాయి కిషోర్, రవి, రాంబాబు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






