బీజేపీ నేతలను అరెస్టు చేసిన చందానగర్ పోలీసులు

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు బీజేపీ నేత‌ల‌ను సోమ‌వారం చందాన‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేశారు. కొంద‌రిని గృహ నిర్బంధం చేయ‌గా, మ‌రికొంద‌రిని అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కులు మాట్లాడుతూ.. ఏదో ఊహించుకొని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నదని అన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా కనిపిస్తున్నందున ఈ ఊహాగానాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయం అరెస్టు చేసిన చందానగర్ పోలీసులు నేత‌ల‌ను సాయంత్రం విడుదల చేశారు. అరెస్టు అయిన‌ వారిలో కసిరెడ్డి భాస్కరరెడ్డి, పోరెడ్డి బుచ్చిరెడ్డి, రవీంద్ర ప్రసాద్ దూబే, వసంతకుమార్ యాదవ్, తోపుగొండ మహిపాల్ రెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, నాగులు గౌడ్, అజిత్ కుమార్, చంద్రమోహన్, రాజు శెట్టి, శాంతి భూషణ్ రెడ్డి, క్రాంతి, పట్లోళ్ల నర్సింహా, చంద్రమౌళి గౌడ్ ఉన్నారు.

చందాన‌గ‌ర్ పోలీసుల అదుపులో బీజేపీ నేత‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here