- కార్పొరేటర్ హమీద్ పటేల్
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో పాల్గొనేందుకు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ విధిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పట్టభద్రులను కలసి అభ్యర్ధించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ హిల్స్, గౌతమి ఎన్క్లేవ్ లలో పలు అపార్ట్మెంట్స్ కు వెళ్లి ఎమ్యెల్సీ ఓటరు దరఖాస్తులను పలు కాలనీ అసోసియేషన్ సభ్యులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ అందజేశారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పట్ల ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న సుపరిపాలన పట్ల మేథావులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు.
కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట వార్డు మెంబర్ శ్రీనివాస్ చౌదరి, ఏరియా కమిటీ మెంబర్ కరీం, యూత్ నాయకులు దీపక్, అస్లాం, కాలనీ అసోసియేషన్ సభ్యులు సీహెచ్ కిరణ్, మురళీ మోహన్, మోహన్, మురళీ కృష్ణ, శేషాచార్యులు, రామారావు, సుధీర్ కుమార్, వెంకటేశ్వర రావు, సత్య ప్రకాష్, ఎస్ఎన్ రావు, ఐవీ సుబ్రహ్మణ్యం, కౌశిక్, సతీష్ కుమార్ రెడ్డి ఉన్నారు.