- ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు ఎమ్మెల్యే గాంధీకి అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, తనపై చూపిన ఆధారభిమానాలకు ధన్యుడినని, అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమర్నాథ రెడ్డి, తాత కర్ణాకర్ జనరల్ సెక్రటరీ, మహేందర్ ట్రెజరర్, సభ్యులు నాగిరెడ్డి, సంజయ్, వేణు, మధు, చంద్రశేఖర్, రఘు పాల్గొన్నారు.