నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా సందర్భంగా చేనేత హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత సిస్టర్స్ సంగీతకళా, రాజ్యలక్ష్మి శిష్య బృందం ఆలపించిన పాటలు ఎంతగానో అలరించాయి. నాట్యగురువులు మద్దాలి ఉషాగాయత్రి శిష్య బృందం వాణి భవాని బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.

ఝేమ్ ఝేమ్ తనన, నమశ్శివాయతేయ్, అలరులు కురియగా, శరణం భవ, ఒకపరి కొకపరి, చక్కని తల్లికి, కదన కుతూహల తిల్లాన అంశాలను వాణి, కుమారి నీరజ, లక్ష్మి, కుమారి ఉజ్వల , శ్వేతా, కుమారి చక్రి లు చాల చక్కని ప్రదర్శన ఇచ్చారు.






