నమస్తే శేరిలింగంపల్లి : కార్తీక మాసం చివరి సోమవారం చందానగర్ డివిజన్ వేముకుంటలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శివాలయంలో పరమ శివుని భస్మాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్, జగదీశ్వర్ గౌడ్ కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు.
అనంతరం ఆలయ చైర్మన్ దొంతి సత్యనారాయణ గౌడ్ పూజిత, జగదీశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఆలయం గురించి పూర్తిస్థాయిలో వివరించారు. అనంతరం వేణుగోపాలస్వామి, సాయిబాబా, హనుమాన్, అమ్మవారి ఆలయాలను దర్శించుకోగా.. వారిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, దొంతి రాధ, శుధా రాణీ, ఈశ్వరీ, శాంతా, సంగీత, కవిత, వసంత, నికిత, అలాగే అయ్యప్ప స్వాముల బృందం శ్రీనివాస్ చారి, నరేందర్ రెడ్డి, దొంతి దీపక్ గౌడ్, మల్లేష్, స్థానికులు సాయి, మునీర్, కిరణ్ తో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్ పాల్గొన్నారు.