నమస్తే శేరిలింగంపల్లి: జగద్గిరిగుట్టలోని మాధవ నగర్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎంఎల్ఏ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా మహిళలు ఆయనకు మంగళ హారతులు పట్టి, గులాబీ పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇంటింటి ప్రచారం కొనసాగించారు.
హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వ దృష్టి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.