నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ గెలుపునకు మద్దతుగా ఆ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా తాము కృషి చేస్తామంటూ పార్టీలో చేరుతున్నారు పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు.
ఈ నేపథ్యంలో చందానగర్ డివిజన్ కేఎస్ ఆర్ కాలనీకి చెందిన సీనియర్ నాయకులు రవీంద్ర నాథ్, అరెకపూడి ప్రసాద్, కోటేశ్వర్ రావు, లింగరెడ్డి, రామ్ మోహన్ రావులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జగదీశ్వర్ గౌడ్ మాట్లాడారు.