నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్ బిఆర్ టవర్స్, ఎస్ఆర్ ఎస్టేట్స్, వీడియో కాలనీ , ఎఫ్ సి ఐ కాలనీ, అమన్ కాలనీ, చిరంజీవి కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో నిర్వహించారు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, పార్టీలో చేరిన వారంతా పార్టీకోసం కష్టపడి పనిచేయాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయో భిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.