వ‌ర‌ద బాధితుల‌కు సీఎం కేసీఆర్ పెద్ద‌న్న‌లా మారారు

  • కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అకాల వర్షం వల్ల నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకోవటం జరుగుతుందని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం మేరకు కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ, అంజయ్య నగర్, సిద్దిక్‌ నగర్ లలోని బాధిత కుటుంబాలకు కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆర్థిక స‌హాయం అందజేశారు. పేద ప్రజల పట్ల ఉన్న బాధ్యత, చిత్తశుద్ధిని తెరాస ప్రభుత్వం మరోమారు నిరూపించుకుందని తెలియజేశారు. ప్రతి బాధిత కుటుంబానికి ఆ ఇంటి పెద్ద కొడుకులా నిలబడి ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట‌ వార్డు మెంబర్ జంగంగౌడ్, వైస్ ప్రెసిడెంట్ భీమిలి శ్రీనివాస్, నీలం లక్ష్మినారాయణ, యూత్ నాయకులు దీపక్, మతీన్, ఖాసీం స్థానికులు ఉన్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here