శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఆ పార్టీ శేరిలింగంపల్లి ఇన్ చార్జి రవికుమార్ యాదవ్ గురువారం కలిశారు. దుబ్బాకలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రవికుమార్ యాదవ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి తరలివెళ్లి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. అనంతరం ఎంపీ రేవంత్ రెడ్డిని రవికుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిశారు. ఎన్నికలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ నాయకులు రాధా కృష్ణ యాదవ్, ఇలియాస్ షరీఫ్, గంగాధర్ రెడ్డి, ఎల్లేష్ పాల్గొన్నరు.