- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: గడపగడపకు బీజేపీ రవన్న ప్రజా యాత్ర కార్యక్రమంలో భాగంగా లింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ సి బ్లాక్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని, బీజేపీ అధికారంలోకి వస్తే బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలు అన్ని బయటకి వస్తాయని, అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
వీళ్ళ డ్రామాలు ప్రజలకు తెలుసు అని, వారికి తగిన బుద్ధి చెప్తారన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల కోసం, ప్రజా సమస్యలపై పోరాటం చేసేది , చేస్తుంది , ప్రజలకు అండగా ఉంది బీజేపీ ఒక్కటేనన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ పైపు ఉన్నారు. వారి ఆశీస్సులతో కాషాయం జెండా ఎగరవేయడం తథ్యం అన్నారు. గెలిచిన తరువాత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చల నాయకులు , కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.