ల‌య‌న్స్ క్ల‌బ్ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేయాలి

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయడంతోపాటు పేద ప్రజలకు భరోసాగా నిలవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగ‌ళ‌వారం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ నూతన క్లబ్ సభ్యులు ఆరెక‌పూడి గాంధీని క‌లిసి ఆయ‌న‌కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్లబ్ ఆధ్వ‌ర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు కుట్టు మెషిన్లను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా అందజేశారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలుపుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ నూతన క్లబ్ సభ్యులు

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ నూతన క్లబ్ కు శుభాకంక్షాలు తెలియజేశారు. పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఎల్లప్పుడూ ముందు ఉండాలని, ప్రజల బాగోగుల కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఉన్నత వర్గాలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

మ‌హిళ‌ల‌కు కుట్టు మెషిన్ల‌ను అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మ‌న్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్‌, లయన్స్ క్లబ్ ఆఫ్ శేరిలింగంపల్లి అధ్యక్షుడు అశోక్ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, గండిచెర్ల జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నూకల సందీప్, జాయింట్ సెక్రటరీ శాంతి భూషణ్ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, బర్క మల్లేష్ యాదవ్, మారం ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here