పేద‌ల క‌ష్టాలు తెలిసిన వ్య‌క్తి సీఎం కేసీఆర్

  • కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో ప్రతి పేద కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయ‌డం ఆయనకున్న ప్రజాపాలన దక్షతను తెలియపరుస్తుందని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని కొత్తగూడలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు, స్థానిక నాయకులతో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ పదివేల‌ రూపాయల‌ ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.

వ‌ర‌ద బాధితుల‌కు ఆర్థిక స‌హాయం అంద‌జేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

పేద ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక వ్యక్తి, ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. విపత్కర సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఆర్ధిక సహాయానికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు, వార్డు మెంబర్ జంగంగౌడ్, వైస్ ప్రెసిడెంట్ భీమిలి శ్రీనివాస్, తెరాస నాయకులు నీలం లక్ష్మినారాయణ, కుమార్, యూత్ నాయకులు దీపక్, ఖాసీం, మతీన్, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here