శేరిలింగంప‌ల్లిలో వ‌ర‌ద స‌హాయం పంపిణీ

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లు డివిజ‌న్ల‌లో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మంగ‌ళ‌వారం వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని పంపిణీ చేశారు.

చందాన‌గ‌ర్ వేమ‌న వీక‌ర్ సెక్ష‌న్‌లో వ‌ర‌ద స‌హాయం పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

చందాన‌గ‌ర్‌లో…

చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ కాలనీలో బాధితుల‌కు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ వ‌ర‌ద స‌హాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, సునీత రెడ్డి, డివిజన్ తెరాస అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు జేరిపాటి రాజు, గురుచరణ్ దూబే, గోవర్ధన్ రెడ్డి, జహీర్, స్థానికులు పాల్గొన్నారు.

శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ లో వ‌ర‌ద స‌హాయం పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లిలో…

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీల‌లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి వ‌ర‌ద‌ బాధిత కుటుంబాలకి రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు పొడుగు రాంబాబు, పద్మా రావు, కొండల్ రెడ్డి, చింత కింది రవీందర్, రమేష్, రమణ, కోదండరాం, ఎస్‌పీ రెడ్డి, లింగా రెడ్డి, శ్రీకళ, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here