నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ విలేజ్ లో వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వినాయక మండపాలకు వద్ద కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు గంగాధర్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజు, ప్రసాద్, నరేందర్ బల్లా, యశ్వంత్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.