- 14వ రోజు కొనసాగిన సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
కూడు, గూడు, గుడ్డ లేకుండా ఉన్న ఎందరో అభాగ్యులకు ఎంఎస్ఎం ట్రస్ట్ అండగా ఉంటుందని, విద్య ,వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తుందని ఆ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ అన్నారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ తులసినగర్ కమ్యూనిటీహాల్ వద్ద కృష్ణవేణి నగర్, సాయి ప్రశాంత్ నగర్, శ్రీ రామ నగర్ సాయిచరణ్ కాలనీ వారికోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి 400 మందికి కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాటను తుంగలో తొక్కి ప్రజల జుట్టును చేతిలో పట్టుకొని పరిపాలిస్తుందని, ఈ రోజుల్లో కూడా కనీసం కూడు, గూడు, గుడ్డ , లేకుండా ఎందరో అభాగ్యులు ఉన్నారని, వారిని పట్టించుకోవడంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, అందుకే తమ వంతు సహాయంగా ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వీలైనంత సహాయ, సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, నరసింహ చారి, సీతారామరాజు, చంద్రమౌళి, రమణారెడ్డి, ఆంజనేయులు యాదవ్, నాగిరెడ్డి ,రాజారెడ్డి, సునీల్ రెడ్డి, సిద్ధి నర్సింగ్, నరేష్, ఎత్తరి రమేష్, బాలకృష్ణ సైదమ్మ, పద్మ, జ్యోతి పాల్గొన్నారు.