నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా యాంఫిథియేటర్ లో యుఎస్ ఏ నుండి వీచిన ప్రవాస భారతీయులు కళాకారులు కౌశిక నవలే , ఆశిక నవలే కూచిపూడి నృత్యం అలరించింది. ఈ ప్రదర్శనలో రుక్మిణీ ప్రవేశ ధరువు, వసంత జతీస్వరం, ఒకపరికొకపరి అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
ప్రముఖ కూచిపూడి నాట్య గురువులు ప్రతిభారాజ్ గౌడ్ శిష్యబృందం ఆనంద నర్తన గణపతి, మహేశ్వరి మహాకాళి, జాతి స్వరం, భోశంభో, దశావతారం, రామాయణ శబ్దం మొదలైన అంశాలను సంజన, నేహా, కీర్తన, పూజ , వర్షిణి, ఉదయకుమార్ ప్రదర్శించి మెప్పించారు.