నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల ముగింపు కార్యక్రమం లో మేరీ మాటి- మేరా దేశ్ ( నేను పుట్టిన నేల – నను కన్న దేశం) కార్యక్రమంలో భాగంగా మట్టి దీపాలతో బీజేపీ శ్రేణులు ,స్థానికులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పంచ ప్రాణాల ప్రతిజ్ఞ చేశారు.
అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా, ప్రతి అంశంలో బానిసత్వం నుండి విముక్తి చెందాలని, చేదాలని, మన వారసత్వం పై గర్వంగా ,ఐక్యమత్యం మరియు సంఘీభావం తో ఉండేలా , ప్రజల్లో కర్తవ్య భావన పెరగాలనేడే ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, ఆంజనేయులు సాగర్, రాజు, మధు యాదవ్, లక్ష్మణ్, సీత రామరాజు, గణేష్, భరత్, అజిత్, రమేష్, చెన్నయ్య, కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి, మన్యం కొండా సాగర్, నరసయ్య, చంద్ర మౌళి, శ్రీనివాస్ యాదవ్, అశోక్, రవి, మఖన్ సింగ్, కుమార్ యాదవ్, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, జగదీష్, అంభు, అరుణ్,కరణ్, శ్రీకాంత్, నరేష్, వంశీ, కార్యకర్తలు పాల్గొన్నారు.