నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ సాయినగర్ లో నిర్వహించిన గడపగడపకు బిజెపి కార్యక్రమం 72వ రోజు విజయవంతంగా కొనసాగింది. స్థానిక నాయకులతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అధికారులతో కుమ్మక్కై నకిలీ కరెంటు మీటర్లు, అక్రమంగా నల్ల కలెక్షన్లు తీసుకొని ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యేకు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పి ఇంటికి పంపియాలని ప్రజలను కోరారు.
రేపు రాబోయేది బిజెపి ప్రభుత్వమని తెలిపారు. సాయినగర్ కు మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ కి అవినాభావ సంబంధం ఉందని, తన హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక పోగా.. కబ్జాల రాజకీయం, ఓట్ల రాజకీయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, రవి గౌడ్, పృథ్వీగౌడ్, శ్రీశైలం కురుమ, రవి ముదిరాజ్, అశోక్, జగన్ గౌడ్, బాబు, శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, గణేష్ ముదిరాజ్, శివ, మల్లేష్ బాబు, యాదగిరి, రాజు, రామారావు, శ్రీను పాల్గొన్నారు.