నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని దళితులకు రాజకీయ ప్రమేయం లేకుండా దళిత బంధు అమలు చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మార్వో కి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె వెంకటస్వామి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి దళిత కుటుంబానికి గృహలక్ష్మీ పథకం ద్వారా. పది లక్షలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐదు లక్షలు ఇవ్వాలని, వలస వచ్చి హైదరాబాదులో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న ప్రతి దళితకు. జీవో 58, 59 కింద పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళితులపై జరుగుతున్న దాడుల కు సంబంధించి. ఎస్సీ ఎస్టీ. అట్రాసిటీ కేసులు సక్రమంగా ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా అమలు జరగాలని ఎంఆర్ఓ ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రామకృష్ణ, డిహెచ్ పిఎస్ మండల కార్యదర్శి ఎస్ కొండలయ్య, ఇజ్జత్ నగర్ సిపిఐ పార్టీ కార్యదర్శి కూన కాసిం, ఏ వైపు మండల కార్యదర్శి జెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.