- పై కప్పులుడుతూ భయాందోళన గురిచేస్తున్న వైనం
- జిహెచ్ ఎంసీ కమీషనర్ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేతలు
నమస్తే శేరిలింగంపల్లి: కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా.. వారున్న చోటే మెరుగైన వైద్యం అందుతున్న ఏదో వెలతి కలబడుతున్నది. కార్పొరేట్ స్థాయిలో చికిత్సలు ఉచితంగా చేయించుకుంటున్న భయాందోళన నుంచి బయటపడలేకపోతున్నారు. జబ్బు తగ్గించుకునేందుకు వస్తే ఇంకో కొత్త సమస్య ఎదురవుతున్నది. బస్తి దవాఖానలు ఏర్పాటు బాగానే ఉన్నా.. నిరంతర నిర్వహణ కరువవడంతో ఎప్పుడు ఓ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల బస్తి దవాఖానలు
కొనసాగుతున్న పాత భవనాలలో పైకప్పులు పెచ్చులూడుతున్నాయి.
శేరిలింగంపల్లి నియోజకవర్గం, తారనగర్ లోని చిన్నపిల్లల బస్తి దవాఖాన ఇదే పరిస్థితిలో ఉంది. గోడల నుండి పెచ్చులు ఊడి పడుతున్న పరిస్థితిని చూసి స్థానిక డివిజన్ ఇంచార్జి శ్రీహరి గౌడ్ పరేషాన్ అయ్యారు. వెంటనే ఈ సమస్యను సీనియర్ నాయకులు జేరిపాటి జైపాల్, మైపాల యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ , స్థానిక ఎమ్మెల్యే 90 % పనులన్నీ పూర్తయ్యాయి.. ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారని కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని తెలిపారు. పిల్లల దవాఖాన పరిస్థితిని చూసి పిల్లలకు జరగబోయే ప్రమాదం గురించి జిహెచ్ ఎంసీ కమీషనర్ తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కట నరసింహ గౌడ్, రాజేందర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, సాయి కిషోర్, సూర్య రాథోడ్, కొండ, నవీన్ పాల్గొన్నారు.