
చందానగర్: చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ నిలయం, సాయి మేఘన, పెరినిడు, సాయి భవ్య, మారుతి తదితర అపార్ట్మెంట్ లలో శనివారం కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆమె కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. సి.సి రోడ్లు, డ్రైనేజీ సమస్య, వర్ష కాలం వరద నీటి సమస్య, వీధి స్తంభాలు, ఎల్ఈడీ లైట్లు తదితర సమస్యలను కాలనీవాసులు కార్పొరేటర్ కు వివరించారు. వెంటనే సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని తెలిపారు. కరోనా విషయంలో అపార్ట్మెంట్ వాసులు ఎవ్వరు కూడా భయబ్రాంతులకు గురికావద్దు అని, కరోనా వచ్చిన భయపడాల్సిన అవసరం లేదన్నారు.





