- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
కూకట్పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీలో వరద బాధితులకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వరద సహాయం రూ.10వేలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. వరద ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. బాధితులందరికీ రూ.10వేల సహాయం అందేలా చూస్తామన్నారు. ప్రజలకు అన్ని సమయాల్లోనూ అండగా ఉంటామన్నారు.


ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, మహేందర్, మహేష్, శ్రీధర్ పాల్గొన్నారు.





