నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మిత్ర శేరిలింగంపల్లి ఫౌండర్ చైర్మన్ లయన్ సి. యాదగిరి గౌడ్ ఎంజేఎఫ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను తన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారిలో బిఆర్ఎస్ ఉద్యమకారులు ప్రొ పి వై రమేష్, మిద్దెల మల్లారెడ్డి, కంది జ్ఞానేశ్వర్, హానీఫ్ ఉన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ప్రతిసారి వేడుకగా.. ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.