- సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న డివిజన్లలో శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉందని అలానే రానున్న రోజులలో మరింత అభివృద్ధికి తోడ్పడుతామని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని రోడ్డు పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, కే ఎన్ రాములు, గోపాల్ యాదవ్, దివాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గోపీనాథ్, సురేష్, లక్ష్మీ, రవీందర్ రాథోడ్, సాయి పాల్గొన్నారు.