- రవీంద్ర భారతి లో 15న జరిగే జాతీయ కన్వెన్షన్ కు పూర్తి మద్దతు
- యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని, బీసీ సమస్యలపై పోరాడుదామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల గణన, బీసీ సమస్యలపై జరిగే జాతీయ కన్వెన్షన్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. రవీంద్ర భారతి లో 15న జరిగే ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు కిరణ్ కుమార్, కొండల్, శ్రావణ్ కుమార్, కావటి చంద్రశేఖర్ యాదవ్, వెంకటేష్, శివ యాదవ్, మల్లేష్ తో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ గోడపత్రికను భేరి రామచందర్ యాదవ్ ఆవిష్కరించారు.