కుతుబ్ షాహీ మసీదు అభివృద్ధి పనులకు తోడ్పాటు అందిస్తాం

  • కుతుబ్ షాహీ మసీదును సందర్శించిన మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర యువ జన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్
  • మూసివేసిన రహదారి సమస్యను పరిష్కరిస్తామని హామీ

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి వద్ద ఉన్న కుతుబ్ షాహీ మసీదుకు వెళ్లే రహదారి మూసివేయడంతో.. మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసుకోలేక పోతున్నామని స్థానిక మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర యువ జన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక మత పెద్దల విజ్ఞప్తి మేరకు వారు శుక్రవారం మసీదు ను సందర్శించారు. ఈ సందర్బంగా మతపెద్దలు మసీదుకు సంభందించిన పలు అభివృద్ధి పనుల గురించి క్షుణ్ణంగా వారికీ వివరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీ, అధికారుల దృష్టికి ఏ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు. మసీదు అభివృద్ధి పనులను గురించి అధికారులతో చర్చించి తగిన విధంగా చర్యలు తీసుకొని మసీదు అభివృద్ధి పనులకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. సయ్యద్ నాయీమ్, గడ్డం రవి యాదవ్, గడ్డం మహేష్, సయ్యద్ మొహ్మద్ అక్బర్ హుస్సేన్, షేక్ రియాజ్, సయ్యద్ పాషా, మొహ్మద్ అమీర్ అలీ, దస్తగిరి, పులి సాయి, విక్కీ యాదవ్, మహేష్, సాయి గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here