- ‘సిప్ ప్రోడజీ 2023’ పోటీల్లో సత్తా
- 2500 మందితో 11నిమిషాల్లో 200 లెక్కలు
నమస్తే శేరిలింగంపల్లి: సిప్ అబాకస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈనెల 2న ఆదివారం శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ లో తెలంగాణా రాష్ట్ర స్థాయి ‘సిప్ ప్రోడజీ 2023’ పోటీలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 6 నుంచి 12 ఏండ్ల లోపు పిల్లలు సుమారు 2500 మంది పాల్గొని 11నిమిషాల్లో 200 లెక్కలు కాలిక్యులేటర్ కంటే వేగంగా చేసి ఆహూతులను అబ్బుర పరచారని సంస్థ రాష్ట్ర ప్రతినిధి భరత్ కుమార్ వెల్లడించారు. ఈ పోటీల వల్ల పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకత పెరిగి వారు చురుకుగా ఉన్నారని తెలిపారు.
సంస్థ చందానగర్ కేంద్ర విద్యార్థులు వివిధ విభాగాల్లో 28 బహుమతులు(ట్రోఫీలు) కైవసం చేసుకున్నారని చందానగర్ కేంద్ర నిర్వాహకురాలు కుసుమ వ్రభాకర్ చెప్పారు. చందానగర్ కేంద్రం స్థాపించిన 2006 వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ జరిగిన అన్ని పోటీల్లో తమ బ్రాంచ్ విద్యార్థులు విశేష ప్రతిభ కనపరుస్తున్నారని, ఇంత వరకూ సుమారు 3000 మంది పైగా విద్యార్ధులు తమ కేంద్రం నుంచి అబాకస్ లో శిక్షణ పొందారని ఆమె అన్నారు. ఆసక్తి ఉన్నవారు 9866636219 నెంబర్ పై సంప్రదించవచ్చని ఆమె అన్నారు.