నమస్తే శేరిలింగంపల్లి: మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం హాఫిజ్ పేట్ 109 డివిజన్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గీత సెల్ కన్వీనర్ రవి గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యలు బోయిని మహేష్ యాదవ్, ఓబీసీ కన్వీనర్ పృథ్వి గౌడ్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్, డివిజన్ ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, తమిళనాడు నుండి వచ్చిన విస్తారక్ మూర్తి, శక్తి కేంద్ర ఇంచార్జిలు సజ్జ కోటేశ్వర్ రావు , భూత్ ఇంచార్జి మురళి, జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షులు ఆళ్ళ వరప్రసాద్, శివ ముదిరాజ్ రవి, వినాయక్ రెడ్డి, అశోక్, కుమార్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బూత్ నెంబర్ 193, 194, 195, 196, 197 లలో గడప గడపకు తిరుగుతూ నరేంద్ర మోడీ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.