- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
- 64వ రోజుకు చేరిన గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో నిర్వహించిన గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర 64వ రోజుకు చేరుకున్నది. నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ , ఇంటి ఇంటికీ కరపత్రాలను పంచుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ బీజేపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీకి ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో భిక్షపతి యాదవ్ సర్వే నంబర్ 80, సుభాష్ చంద్రబోస్ నగర్ వాసులు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటే వారికి కరెంట్ మీటర్లు, రోడ్లు , డ్రైనేజీ లైన్లు, మంజీరా లైన్లు , అంగన్వాడీ బిల్డింగ్, రేషన్ షాపు ఇలా ఎన్నో చేశారని గుర్తు చేశారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల క్రితం అప్లై చేసిన పెన్షన్లు ,రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని అన్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించండి మీ అందరికీ ఏ సమస్యైన , ఏ సమయమైనా ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, మదనా చారి, మధు యాదవ్, శ్రీధర్, రాము, సూర్య, రాము, గోవర్థన్ రెడ్డి, చంద్ర శేఖర్ యాదవ్, ఎల్లేష్, యాదయ్య, కుర్మయ్య, బాలు నాయక్, భారతి , నరేష్, పద్మ , పార్వతి, నాగులు, నరేష్, నవీన్ రెడ్డి, వెంకటేష్ , సాయి, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.