- ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి నివాళి
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే బ్రిడ్జి పక్కన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు, తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితమంతా పాటు పడ్డారని పేర్కొన్నారు. జయశంకర్ సార్ తెలంగాణ కు ఒక దిక్సుచి అని అన్నారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మల్లికార్జున శర్మ ,బీఆర్ఎస్ పార్టీనాయకులు కృష్ణ యాదవ్, నటరాజు, గోవిందా చారీ, గోపి కృష్ణ, కవిత, నరేందర్ బల్లా, సందీప్, కార్యకర్తలు పాల్గొన్నారు.