నమస్తే శేరిలింగంపల్లి: షాబాద్ మండల కేంద్రంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ బస్వేశ్వర విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పాటిల్, జడ్పీటీసీ అవినాష్ రెడ్డి, రాష్ట్ర హాకీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తో కలిసి పాల్గొని ఆవిష్కరించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహాత్మ బస్వేశ్వర విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన కొండా విజయ్ ని ప్రత్యేకంగా అభినదిస్తున్నట్లు తెలిపారు.
12వ శతాబ్దంలో నే బసవేశ్వరుడు అనుభవ మంటపం ను స్థాపించి, కులమతాలకు అతీతంగా అందరికి సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు. ఆకాలంలోనే హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించి, సహ పంక్తి భోజనాలు నిర్వహించారని, స్త్రీలకు సమాన హక్కులు కల్పించారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. 2016 సంవత్సరం లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు, అధికారికంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య, సమాజం, సమానత్వం గురించి పోరాటం చేసిన మహనీయుడు, సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు బసవేశ్వరుని జయంతి సందర్భంగా వారికివే మా నివాళులన్నారు. సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు బసవన్న జీవితం ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో నడవాలని, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం ఆయన జీవితం అని ఆయన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో సంఘము సభ్యులు లింగప్ప, శ్రీకరప్ప, మల్లికార్జున్, ప్రదీప్, నవీన్ , బస్వరాజ్, పర్శవేది, ప్రవీణ్, శేఖర్, సంతోష్, సందీప్, రవి, విశ్వనాథ్, రమేష్, దీపక్, సర్వేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.