- ప్రజలకు ఏ కష్టమొచ్చిన ఆదుకుంటాం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ ని ఆదరిస్తూ… తమ వెంట ఉన్న ప్రజలకు రుణ పడి ఉంటామని, ఏ కష్టమొచ్చిన ఆదుకుంటామని మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ క్రాస్ రోడ్ , హేమదుర్గా ప్లాజా వద్ద బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, Dr.నరేష్, ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని, ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కృషి చేస్తామని తెలిపారు.
- అభివృద్ధి శూన్యం.. అప్పుల తెలంగాణ..
రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై , పడకేసిన అభివృద్ధిపై బిజేపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, కొరడాల నరేష్, రవికుమార్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు బొబ్బ నవతారెడ్డి, జానకిరామరాజులు విలెకరుల సమావేశంలో ద్వజమెత్తారు. తెలంగాణ ఒక కుటుంబానికి పరిమితమైందని, మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్త అప్పుల తెలంగాణగా మారిందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మొదటి హామీ దళితున్ని సీఎం చేస్తానన్నారు, కేజీ టూ పీజీ ఏమైందని ప్రశ్నించారు. కాలేశ్వరం వల్ల నిజమైన రైతులకు నీళ్లు రావడం లేదు, ఎకరానికి 50వేల ఖర్చు అవుతుందని తెలిపారు.
- బిఆర్ ఎస్ కు తామే పోటీ..
బిఆర్ ఎస్ కు తామే పోటీ అని, అతిపెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ నాయకుల, కార్యకర్తలు అందరితో కలిసి ఐక్యతగా ముందుకు వెళతామని, అన్నిచోట్లా పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. మేము కలిసే ఉన్నామని, ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేస్తామని తెలిపారు. శేరిలింగంపల్లిలో అభివృద్ధి జరగలేదని, చెరువులను మింగారని, దత్తత తీసుకున్న హైదర్ నగర్ వెళ్లి చూసినా ఎక్కడ ఏమీ లేదని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా వ్యర్థమేఅని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పరిస్థితి మారలేదని, ఆస్పత్రులు మారలేదని, ఇబ్రహీంపట్నంలో గర్భి మృతి చెందారని తెలిపారు.
- కనీస వసతులు కల్పించాలి..
హాస్పటల్ అంటే బిల్డింగ్ లు కాదు..కనీస మౌలిక వసతులు కల్పించడమన్నారు. హైటెక్ సిటీ ఏరియా చూస్తే అమెరికా చూసినట్టు ఉంటుందని, మరి హఫీజ్ పేట్ ఇతర ఏరియాలను పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వీటిపై బూత్ కమిటీల ద్వారానే పోరాటం చేస్తామని చెప్పారు. కేసీఆర్, కేటిఆర్ ఫ్యామిలీపై పోరాటం తథ్యం అన్నారు. ఏ ప్రభుత్వానికి సొంత మీడియా లేకుండానే వందలాది యూ ట్యూబ్ ఛానల్స్ కొన్నారని, సోషల్ మీడియాలో డ్యామినేషన్దు ష్ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారుతున్నారని లేనిపోని ప్రచారం అవన్నీ కేసీఆర్, కేటీఆర్ ప్రాపగండా అన్నారు. బలమైన ఆపొజిషన్ కాంగ్రెస్ అని చెబుతున్నారని, బలమైన పార్టీ కాంగ్రెస్ అంటూ ప్రచారం చేస్తున్నారని, బలమైన బీజేపీని తక్కువ చేసేలా ప్రయత్నం తగదని అన్నారు. బలమైన పార్టీ బీజేపీ మాత్రమేనని నొక్కిచెప్పారు. శేరిలింగంపల్లిలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.