నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. చందానగర్ డివిజన్ పరిధిలో ని అపర్ణ హిల్ పార్క్ వద్ద నిర్వహించిన తెలంగాణ రన్ (2k) కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ నర్సింహ రావు, CI లు తిరుపతి రావు, క్యాస్ట్రో రెడ్డి , కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిత్య వ్యాయామం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుందని తెలిపారు.

ప్రభుత్వ హాయంలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించిందని, వందేండ్ల అభివృద్ధిని సాధించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు,పాత్రికేయ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.