నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ బస్తీ దవాఖాన బిల్డింగ్ లో హెచ్ ఎస్ బి సి సహకారంతో చైల్డ్ ఫండ్ ఆధ్వర్యంలో ‘జెండర్ అండ్ క్లైమేట్ చేంజ్’ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమెన్ ఎంటర్ ప్రి న్యుర్ షిప్ ప్రోగ్రాం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసి కార్పొరేటర్ శేరిలింగంపల్లి రాగం నాగేందర్ యాదవ్ సూచనల మేరకు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేశం గౌడ్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వీరేశం గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చైల్డ్ ఫండ్ సభ్యులకు వివరించారు.
భవిష్యత్తులో రాబోయే విపత్తులను నివారించడానికి సలహాలను సూచనలను చేశారు. పర్యావరణ పరిరక్షణ గురించి సలహాలను తెలియజేసినందుకు వీరేశం గౌడ్ కి చైల్డ్ ఫండ్ సభ్యులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, సిపిడిఓ లక్ష్మీబాయి, ఫీల్డ్ ఆఫీసర్ అనురాజ్, ఆర్గనైజర్ దీప, మొబలైజర్స్ రమేష్, ఆనందం, షబానా, పాల్గొన్నారు.