- 48వ రోజు కొనసాగిన రవన్న ప్రజా యాత్ర
- గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, పార్టీ జెండా ఆవిష్కరించి పాదయాత్ర
నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ సాయి ప్రశాంత్ కాలనీ, కృష్ణవేణి నగర్ లో గడపగడపకు బిజెపి కార్యక్రమం 48వ రోజు కు చేరింది. స్థానిక నాయకులతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పర్యటించి మాట్లాడారు. కృష్ణవేణి నగర్ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈరోజు స్థానికుల కోరిక మేరకు సమస్యల పరిష్కారానికి పర్యటించామని తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కాలనీలో చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, అరుణ్ కుమార్, శేషయ్య, బాలకృష్ణ, వెంకట్ మనోహర్ గౌడ్, ఎం కే దేవ్, సీతారామరాజు కృష్ణంరాజు, నర్సింగ్, సిద్ది నర్సింగ్ ,రామయ్య, సైదమ్మ, బాగోని శ్రీనివాస్, బాలాజీ, బద్రి, రాజారెడ్డి, సునీల్ పాల్గొన్నారు.