నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల సుందరీకరణ… తొమ్మిదేళ్లు గడుస్తున్న ముందుకు సాగడం లేదని ఎం.సి.పి. ఐ ( యు) రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె మురళి అన్నారు. ఎం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై పత్రికా ప్రకటన విడుదల చేసారు. చెరువుల సుందరీకరణ, సంరక్షణ పేరుతో చెరువు కట్టల దిశను మార్చడం కబ్జాదారులకు బిల్డర్లకు ప్రోత్సహించేలా నిర్మాణాలు చేపడుతూ కోట్లు గడిస్తున్నారని తెలిపారు. ఎఫ్ టి ఎల్ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు చేసిన అడ్డుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక మియాపూర్ పటేల్ సుందరీకరణ పేరుతో చెరువును ఎండబెట్టినప్పటి నుంచి ముగ్గురు స్థానిక కాలనీవాసులు చెరువులో చనిపోయారని, అందులో ఇద్దరు చిన్నపిల్లలు కాగా ఒకరు ముగ్గురు పిల్లల తండ్రి వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందలేదని చెప్పారు.
చెరువులో నీళ్లు లేక స్థానిక కాలనీలో భూగర్భ జలాలు తగ్గి నీరు కరువైందన్నారు. గంగారం పెద్ద చెరువు పూర్తిగా ఎమ్మెల్యే అనచరుల చేత కబ్జాకు గురైందన్నరు. చెరువే ఊరికి ఆధారం అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులో నీళ్లు లేకుండా చేస్తున్నాడని, చెరువు కబ్జాలకు ప్రోత్బలం ఇస్తున్నదన్నారు. మియాపూర్ లో అలాగే గంగారం పెద్ద చెరువు, రామసముద్రం కుంట కబ్జాలపై కఠినంగా వ్యవహరించి చెరువు విస్తీర్ణాన్ని తగ్గకుండా సంరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దిన తర్వాతే చెరువుల పండగ చేయాలని అన్నారు. మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు శివాని, గూడ లావణ్య, సుల్తానా బేగం, రజియా బేగం డిమాండ్ చేశారు.